శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన గురువారం నాడు తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతి లో పట్టు , హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలెదన్నారు. చేనేత అమ్మ చల్లని ఒడిలా ఆమె అభివర్ణించారు. నేటి తరం యువతలో కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ చేనేత ను మరింత ఆదరించాలన్నారు.
నిర్వాహకులు జయేష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ఈ డిసెంబర్ 2వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 రాష్ట్రాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 75 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు.