మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్‌రావు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను దాచి అబద్దాలను చెబుతున్నారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వాన్ని, పార్లమెంట్‌ను కూడా తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో కూల్చిన ఇళ్లకు ఏ విధమైన న్యాయం చేస్తారని ప్రశ్నించారు హరీష్‌రావు. అన్ని అనుమతులు ఉన్నాయని మొత్తుకున్నా ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లాలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్‌రావు. సోనియాగాంధీపై ప్రేమ ఉంటే.. ఆమె తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూసీపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు హరీష్‌రావు. ఇకనైనా ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టి చర్చించాలని డిమాండ్ చేశారు.