ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సాగుతోంది. లాస్‌వేగాస్‌లో నిర్వహించిన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో పాల్గొన్నారు మంత్రి. ఈ సమ్మిట్ వేదికగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు లోకేష్. ఈ సందర్భంగా ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని సంబంధిత సంస్థ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్‌ను కోరారు లోకేష్. రాష్ట్రంలో పౌరసేవలు మరింత సులభంగా అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్.
ఈ సమ్మిట్‌లోనే పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రానూయి, రెవేచర్ సీఈవో అశ్విన్ భరత్, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాతో సమావేశమయ్యారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఉన్న అనుకూలతలను వారికి వివరించారు మంత్రి లోకేష్.