24.2 C
Hyderabad
Monday, June 16, 2025
spot_img

హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి నారా లోకేష్..

స్వతంత్ర  వెబ్ డెస్క్: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ బయల్దేరారు. కొద్దిసేపటి క్రితం రాజమండ్రి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హస్తినకు పయనమయ్యారు. ఈ పర్యటలో లోకేష్ ఎవరెవరిరని కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో లోకేష్ పోరాటం చేయనున్నారు. అందులో భాగంగా జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు జాతీయ స్థాయిలో వివరించనున్నారు. అలాగే పార్లమెంట్‌లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్షపూరిత రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం తయారుచేసింది.

త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లెవనెత్తి జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ఎంపీలకు లోకేష్ సూచనలు చేయనున్నారు. ఇక చంద్రబాబుపై నమోదైన కేసులపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో కూడా చర్చించనున్నారు. ఒకవేళ ఏసీబీ కోర్టు, హైకోర్టులలో చంద్రబాబుకు బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టులో టీడీపీ న్యాయ పోరాటం చేయనుంది. దీంతో సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ మాట్లాడనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్