స్వతంత్ర వెబ్ డెస్క్: జగన్ ఒక పెద్ద కట్టింగ్.. ఫిట్టింగ్ మాష్టర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్లే ఇచ్చి డబ్బులు కాజేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై లోకేష్ విరుచుకుపడ్డారు. యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆయన మాట్లాడారు. జగన్ వద్ద రెండు బటన్లు ఉన్నాయన్నారు. బల్లపైన గ్రీన్ బటన్ నొక్కితే ఖాతాలో రూ.10 జమ అవుతుందని.. బల్ల కింద ఎర్ర బటన్ నొక్కితే ఖాతాల్లోంచి రూ.100 ఖాళీ అవుతుందని లోకేశ్ అన్నారు. జగన్ పాలనలో పెట్రోల్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు ఇష్టం వచ్చినట్లు పెంచారని.. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, పింఛన్లలో కోత పెట్టారని.. వంద సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టిన ఏకైక సీఎం.. జగన్ అని విమర్శలు గుప్పించారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే.. రుద్యోగ భృతి కింద యువతకు రూ.3వేలు, ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.