స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి వైట్ హౌస్ లో ఘన స్వాగతం లభించింది. మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు స్వయంగా స్వాగతించారు. 19 తుపాకులతో సాయుధ సైనికులు మోదీకి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జో బైడెన్ స్పందిస్తూ… అమెరికా, భారత్ మధ్య బంధం 21వ శతాబ్దంలో కెల్లా అత్యంత అర్థవంతమైనదని అభివర్ణించారు. ఇరు దేశాల రాజ్యాంగాల్లోని మొదటి మాడు మాటలు ‘వుయ్ ద పీపుల్’ అనే ఉంటాయని, రెండు సార్వభౌమ దేశాలను కలిపి ఉంచే అంశం ఇదేనని పేర్కొన్నారు. కాగా, ద్వైపాక్షిక సమావేశం ముగిసిన అనంతరం మోదీ, బైడెన్ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. మోదీ, బైడెన్ కాసేపట్లో ఇరు దేశాల సంబంధాలపై సంయుక్త ప్రకటన చేయనున్నారు. రక్షణ రంగం, నూతన సాంకేతికతలు, ఆరోగ్య రంగం, పర్యావరణం, వీసాలు, అత్యవసర సేవల రంగాలు తదితర అంశాల్లో పరస్పర సహకారంపై ఒప్పందాలను కూడా ఈ సమావేశంలో వెల్లడించనున్నారు.
వైట్ హౌస్‌లో మోదీకి ఘనస్వాగతం..
0
349
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


