డబ్బు, భూమి కాదు.. ప్రజలే నా ఆస్తి- చంద్రబాబు

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో పేదవారు పేదలుగానే మిగిలిపోతుండగా ధనికులు మాత్రం మరింత ధనవంతులుగా మారుతున్నారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదలను ధనవంతులుగా మార్చడమే టీడీపీ లక్ష్యమని ప్రకటించారు. ఇందుకోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మహిళలతో ప్రజావేదిక’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.

పేదవారికి ఆర్థికంగా చేయూతనిచ్చి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమం చేపడతామని ఆయన వివరించారు. ప్రజల ద్వారా సంపద సృష్టించి పేదలను ధనికులను చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. డబ్బులు, భూములు కాదు.. రాష్ట్ర ప్రజలే తన ఆస్తి అని, ప్రజలకు కష్టం కలగకుండా చూసుకుంటానని చెప్పారు. భవిష్యత్తులో ప్రజలకు కరెంటు కష్టాలను తీరుస్తానని, చార్జీలు పెంచడం కాకుండా ప్రత్యామ్నాయంగా సౌర, పవన విద్యుత్తును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు వివరించారు.

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్