స్వతంత్ర వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట చెక్ పోస్టు దగ్గర ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. చెక్‌పోస్టు సమీపంలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపై మార్కింగ్ కోసం జాతీయ రహదారుల నిర్మాన సంస్థకు చెందిన మార్కింగ్ వాహనం నిలిపి ఉంచారు. రోడ్డు మార్జిన్లను గుర్తించే వైట్ పెయింటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
హైవే పనుల్లో ఉన్న కార్మికులు తమ వాహనాన్ని రోడ్డు పక్కన ఉంచి పనులు చేస్తున్నారు. మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇదే మార్గంలో వస్తున్న కారు వేగాన్ని అదుపు చేయలేక లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణీకులు మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారును అదే మార్గంలో వచ్చిన బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
వడమాల పేట చెక్‌పోస్ట్ దగ్గర సెకన్ల వ్యవధిలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగిఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడం అది రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో మరో మూడు వాహనాలు దానిని ఢీకొట్టాయి.
నగరి సమీపంలో జాతీయ రహదారికి రేడియం మార్కింగ్ చేస్తున్నారు. ఆ పనుల కోసం ఆరుగురు సిబ్బందితో కూడిన వాహనంతో పనులు చేస్తున్నారు. హైవే సిబ్బంది ఉన్న లారీని ఢీకొట్టింది. ఆ మార్గంలో వస్తున్న వాహనాలు వరుసగా ఢీకొట్టాయి. సెకన్ల వ్యవధిలో ఐదు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొట్టాయి.
ఈ ప్రమాదానికి అతివేగమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు.ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం కారణంగా చెన్నై-తిరుపతి మార్గంలో కిలోమీటరు పొడవున వాహనాలు నిలిచిపోయాయి.