సోషల్ మీడియాలో ట్రెండవుతున్న మోదీకా పరివార్

      2024 ఎన్నికలే బీజేపీ లక్ష్యంగా దూసుకుపోతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లను సాధించి చరిత్ర సృష్టించేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో.. మరోసారి మోదీ సర్కార్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. అయితే ప్రధాని మోదీకి కుటుంబం లేదని ప్రతిపక్ష నేత లాలు ప్రసాద్ యాదవ్ హేళన చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న మోదీ అభిమానులు, బీజేపీ నేతలు తామంతా మోదీ కుటంబమే అంటూ ట్వీట్ చేస్తున్నారు. మరోవైపు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరి అలాగే బీజేపీ ఎంపీలు, కీలక నేతలు తమ ట్విట్టర్ ఖాతాలో వారి పేరు పక్కన మోదీ కా పరివార్ అని చేర్చుకు న్నారు. దీంతో అనేకమంది బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోదీకి సపోర్ట్‌గా మోదీ కా పరివార్ ట్యాగ్ లైన్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. ఇదిలా ఉంటే.. అదిలాబాద్‌లో బీజేపీ సంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తూ… తనకు పరివారం లేదని కొందరు అంటున్నారని… దేశంలోని 140 కోట్ల మంది తన కుటుంబమే అంటూ స్పష్టంచేశారు. వారి కోసమే తాను ఇంటిని వదిలి బయటకు వచ్చాననిఆయన చెప్పుకొచ్చారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్