తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

     తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఏప్రిల్‌, మేలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావంతో మార్చిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయని, ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత లు నమోదు అవుతున్నాయి. గతేడాది మార్చ్‌ మొదటి వారంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే… ఇప్పుడు సగటున 35 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. ఎల్‌నినో కారణంగా ఇలా జరుగు తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 10 రోజులపాటు తెలంగాణలో ఇలాంటి వాతావ రణ పరిస్థితులే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

      ఏపీలో మార్చి నుంచే తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవు తాయని తెలిపింది. ఏప్రిల్‌ మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయ ని తెలిపింది. తీవ్రమైన వడగాల్పుల కారణంగా ప్రజలు వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వడగాలుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులు నిర్ణయించారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తీవ్రంగానూ, అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్