మోడీ కీ గ్యారంటీ వర్సెస్ కాంగ్రెస్ న్యాయ్ గ్యారంటీ

   లోక్‌సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ తేదీ దగ్గర పడటంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమితో తాడోపేడో తేల్చుకోవడానికి జాతీయ పార్టీ కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి సన్నద్దమైంది. మోడీ కీ గ్యారంటీ పేరుతో భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. దీనికి కౌంటర్‌గా న్యాయ్ పత్ర పేరుతో తన వాగ్దాన ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. తమ సంప్ర దాయక ధోరణికి భిన్నంగా జనాభాలో అత్యధిక మెజరిటీగా ఉన్న వర్గాల ప్రయోజనాలనుద్దేశించి ఐదు న్యాయాల ఎన్నికల ప్రణాళికను హస్తం పార్టీ విడుదల చేసింది.

    రైతులు, యువకులు, మహిళలు, కార్మికులకు ప్రధానంగా ఐదు అంశాలతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నారీ న్యాయ్, యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్‌, హిస్సేదారీ న్యాయ్ పేరిట ఐదు న్యాయాలను ప్రధాన వాగ్దానాలుగా ప్రజల ముందు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు అధికారం ఇస్తే దేశంలో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుడతామని కాంగ్రెస్ పార్టీ హమీ ఇచ్చింది. ఈ సందర్బంగా మొత్తం 25 గ్యారంటీలను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ పాతిక గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్లే బాధ్యతను పార్టీ కార్యకర్తలపై పెట్టారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.

   లోక్‌సభ ఎన్నికల సందర్భంగా న్యాయ్ పత్ర-2024 పేరుతో దేశ ప్రజలకు కీలక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులు, యువకులు, మహిళలకు న్యాయ్ పత్రలో ముఖ్యమైన హామీలు ఇచ్చింది హస్తం పార్టీ. జాతీయస్థాయిలో కులగణన, రిజర్వేషన్ల పరిమితి 50శాతం పెంపు, రైతులు పండించే పంటలకు చట్టబద్దమైన మద్దతు ధరలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు పది శాతం కోటా, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు సహా అనేక గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ తెరమీదకు తీసుకువచ్చింది. అలాగే సీనియర్ సిటిజన్లకు, వితంతువులకు నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కొంతకాలంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కులగణన అంశాన్ని కూడా ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించింది కాంగ్రెస్ పార్టీ. అణచివేతకు గురైన కులాల జనాభాకు సామాజిక న్యాయం చేయడానికి జాతీయ స్థాయిలో కులగణన చేపడతామని ఎలక్షన్ మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అలాగే సైన్యంలో నాలుగేళ్ల సర్వీస్ కోసం నరేంద్ర మోడీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఎప్పటిలాగే పూర్తికాలం సైన్యంలో కొనసాగే రిక్రూట్‌మెంట్ విధానాన్ని పునరుద్ధరిస్తా మని హస్తం పార్టీ హామీనిచ్చింది. భారతీయ జనతా పార్టీ పదేపదే తెరమీదకు తీసుకువ స్తున్న జమిలి ఎన్నికల ప్రతిపాదనను కూడా కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మ్యానిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఒకే దేశం – ఒకే ఎన్నిక ఆలోచనను తిరస్కరించింది. అలాగే ఎన్నికల బాండ్లు, పీఎం కేర్స్‌, రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

   దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంలోనూ అలాగే ధరలను నియంత్రించడంలోనూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. నల్ల ధనాన్ని నియంత్రించడానికే పెద్ద నోట్లను రద్దు చేశామని కొన్నేళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది. పెద్ద నోట్లను రద్దు చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు విదేశాల నుంచి ఎంత నల్లధనాన్ని తీసుకువచ్చారో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పలేదు. దీంతో నల్లధనాన్ని నియంత్రించడంలో బీజేపీ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. అన్నదాతలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభు త్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళనలను ఈ సందర్భంగా హస్తం పార్టీ తెరమీదకు తెస్తోంది. అంతేకాదు దాదాపు మూడేళ్ల కిందట మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పుడు ఇచ్చిన హామీలను మోడీ సర్కార్ ఇప్పటి వరకు అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

      ఇదిలా ఉంటే ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామన్న గట్టి నమ్మకంతో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ప్రధాన నినాదం మోడీకీ గ్యారంటీ. యువతకు ఉద్యోగాలు, మహిళలకు సాధికారత, రైతులకు సంక్షేమం  బీజేపీ ప్రచారంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఉమ్మడి పౌరస్మృతి, సీఏఏ, ఆర్టికల్ 370 రద్దు అంశాలను తమ విజయాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పుకుంటోంది.ఇదిలా ఉంటే అయోధ్యలో రామమందిర అంశం, ఈ ఎన్నికల్లో తమకు వరంలా మారుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ఐదు దశాబ్దాల హిందువుల కలను నరేంద్ర మోడీ ప్రభుత్వం సాకారం చేసిందని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ప్రధానంగా హిందీ భాష మాట్లాడే ప్రాంతాల్లో అయోధ్య అంశమే తమను గట్టెక్కిస్తుందని కమల నాథులు భరోసాతో ఉన్నారు.అయితే తాజాగా తెరమీదకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివాదం బీజేపీ సర్కార్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. ఎన్నికల బాండ్ల పేరుతో కమలం పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిం దన్న  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల బాండ్ల ద్వారా పార్టీకి వచ్చిన విరాళాలను ప్రతిపక్షపార్టీల్లో చీలికలు తీసుకురావడానికి బీజేపీ ఉపయోగించిందన్న ఆరోపణలు పట్టణ ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నాయి. మొత్తంమీద 18వ లోక్‌సభ ఎన్నికల్లో హోరాహోరీ గా తలపడటానికి అటు ఎన్డీయే కూటమి, ఇటు ఇండియా కూటమి సన్నద్ధమయ్యాయి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్