ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌లలో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో రేవంత్ పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో ఈ సభలు ఏర్పాటు చేశారు. ప్రచార పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం పదకొండున్నరకి నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. నిజామాబాద్ మీటింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటారు. మంచిర్యాల ప్రచార సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కరీంనగర్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు.