25.7 C
Hyderabad
Sunday, March 16, 2025
spot_img

దాయాదుల పోరులో టీమిండియా సూపర్ విక్టరీ.. సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ

దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ పై సూపర్ విక్టరీ సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టార్గెట్ ని టీమిండియా 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

విరాట్ కోహ్లీ బౌండరీ బాది శతకం పూర్తి చేసుకోవడంతో మ్యాచ్ ను ముగించాడు. విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లు 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 56 పరుగులు, శుభ్ మన్ గిల్ 46 పరుగులతో రాణించారు.

పాకిస్థాన్‌ విధించిన మోస్తరు లక్ష్యం 242 లక్ష్యాన్ని చాలా తేలికగా భారత జట్టు సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (20) తక్కువ పరుగులకే పరిమితమవగా.. గత మ్యాచ్‌ సెంచరీ యువరాజు శుభమన్‌ గిల్‌ కొద్దిలో అర్ధ శతకాన్ని చేజార్చుకున్నాడు. 52 బంతుల్లో 46 పరుగులు చేయగా.. రోహిత్‌ ఔట్‌తో స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ రంగంలోకి దిగాడు. మొదట్లో ఆచితూచి ఆడిన కోహ్లీ క్రమంగా పుంజుకుంటూ ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఒక్క సిక్సర్‌ లేకుండా శతకం నమోదు చేయడం విశేషం. మొత్తం 7 ఫోర్లు బాది విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ దూకుడైన బ్యాటింగ్‌తో (67 బంతుల్లో 56 పరుగులు) అర్థ సెంచరీ పూర్తి చేసి నిష్క్రమించాడు. హార్దిక్‌ పాండ్యా రాగానే దూకుడైన బ్యాటింగ్‌తో 8 పరుగులు చేసి వెళ్లిపోయాడు. క్రీజులో ఉన్న అక్షర్‌ పటేల్‌ (3)తో కలిసి కోహ్లీ విజయంతో మ్యాచ్‌ను ముగించాడు.

పాక్‌ ఘోరంగా వైఫల్యం
మోస్తరు లక్ష్యాన్ని పాకిస్థాన్‌ బౌలర్లు కాపాడలేకపోవడంతో జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి అనధికారికంగా వైదొలిగింది. ఆరంభం నుంచి బౌలర్లు భారత్‌ను నిలువరించలేకపోయారు. పటిష్టంగా బౌలింగ్‌ చేస్తూనే ఉన్నా వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. క్రీజులో పాతుకుపోయిన కోహ్లీ, శ్రేయస్‌, ఒక దశలో గిల్‌ను నియంత్రించలేకపోయారు. దీనికితోడు క్యాచ్‌లు మిస్‌ జట్టు ఓటమిలో ప్రధాన కారణంగా నిలుస్తోంది. షాహిన్‌ అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. అబ్రార్‌ అహ్మద్‌, కుష్దీల్‌ షా చెరొక వికెట్‌ తీశారు. మిగతా బౌలర్లు భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పక తప్పదు.

అంతకుముందు టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బాబర్ ఆజం (23), ఇమామ్ (10) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌ చేరగా.. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్ (76 బంతుల్లో 62 పరుగులు), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (77 బంతుల్లో 46 పరుగులు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ వికెట్ ఇవ్వకుండా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. షకీల్‌, ఇమామ్‌ కలిసి 3వ వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాక్ మోస్తరు స్కోర్‌ సాధించింది. తయ్యబ్ తహీర్ (4) తక్కువ స్కోర్‌కు ఔటవగా.. అనంతరం కుష్దిల్ షా (39 బంతుల్లో ౩8, 2 సిక్సర్లు) రాణించడంతో పాక్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్