29.2 C
Hyderabad
Sunday, May 10, 2026
spot_img

మీ దగ్గర మ్యాజిక్ నంబర్ లేదుగా.. విజయ్‌కు గవర్నర్‌ షాక్‌

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించిన సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండగా… తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను మరింత ఉత్కంఠగా మార్చాయి.

ఎన్నికల ఫలితాల అనంతరం… కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ గవర్నర్‌ను కలిశారు. తమకు అవసరమైన సంఖ్యాబలం ఉందని తెలియజేస్తూ అధికార పీఠం కోసం అనుమతి కోరారు. అయితే… విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతుపై గవర్నర్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో… మ్యాజిక్ నంబర్ మీ వద్ద లేదు.. అనే సంకేతాలను గవర్నర్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక మరోవైపు… టీవీకేకు మద్దతు విషయంలో వామపక్ష పార్టీలు స్పష్టత ఇచ్చాయి. విజయ్ పార్టీకి తమ మద్దతు ఉండదని లెఫ్ట్ పార్టీలు ప్రకటించడంతో… టీవీకేకు సంక్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో సంఖ్యాబలం సాధన మరింత కష్టతరంగా మారింది.

ఇదిలా ఉంటే… ఎన్నికల ఫలితాలకు ముందు అన్నాడీఎంకేతో పొత్తు చర్చలు జరిపిన టీవీకే… ప్రస్తుతం ఆ చర్చలను పక్కన పెట్టినట్లు సమాచారం. కాంగ్రెస్ మద్దతు లభించిన నేపథ్యంలో… ప్రత్యామ్నాయ కూటమి అవసరం లేదనే భావనలో విజయ్ ఉన్నారని తెలుస్తోంది. అయితే గవర్నర్ స్పందనతో ఆ వ్యూహం ఎంతవరకు సఫలమవుతుందో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం… స్పష్టమైన మెజారిటీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమని, విజయ్ త్వరలో మరిన్ని పార్టీల మద్దతు కోసం ప్రయత్నించే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు… రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

టీవీకే విజయం తర్వాత ఏర్పడిన ఉత్సాహానికి గవర్నర్ కొంత బ్రేక్ వేసినట్లయింది. ఇకపై విజయ్ ఎలాంటి రాజకీయ వ్యూహాలు అవలంబిస్తారు..? ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమవుతుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

Latest Articles

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… మోదీతో రేవంత్ ప్రత్యేక భేటీ

హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక పరిణామాలకు రంగం సిద్ధమైంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi) హైదరాబాద్‌కు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక వినతులు సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్