23.7 C
Hyderabad
Tuesday, March 25, 2025
spot_img

ఎస్ఎల్ బీసీ సొరంగం నుంచి కార్మికులను బయటకు తీయలేని పరిస్థితి- మంత్రి జూపల్లి

ఎస్ఎల్ బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాల‌తో క‌లిసి లోకో ట్రైన్ లో ట‌న్నెల్ లోకి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆరు గంటల పాటు మంత్రి జూపల్లి సొరంగంలోనే ఉన్నారు. ప్రమాద స్థలం దగ్గర నుంచి ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఇంటర్ కామ్ ఫోన్ లో మాట్లాడారు. స్వయంగా సహాయక చర్యల్లో ఆయన పాల్గొన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు లోపల జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంజినీరింగ్, సహాయక బృందాలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బయట నుంచి ప్రమాద స్థలికి సొరంగంలో మధ్య దూరం 13.5 కిలోమీటర్లు.

ఎస్ఎల్బీసీ లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డంలో మాన‌వ త‌ప్పిదం జ‌ర‌గ‌లేద‌ని, ఇందులో ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం ఏం లేద‌ని, ఆక‌స్మాత్తుగా సొరంగంలో మ‌ట్టి, నీరు చేర‌డం వ‌ల్లే ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని వెల్ల‌డించారు. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, ఎన్డీఆర్ఎఫ్, డిజాస్ట‌ర్ మెనేజ్మెంట్ సైనిక బృందాల ఆద్వ‌ర్యంలో ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. అడ్డంకులు అధిగమించి ఘటనాస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని. నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి నెల‌కొంద‌ని పేర్కొన్నారు.

ఇదీ ప‌రీక్ష స‌మ‌య‌మ‌ని, కానీ బీఆర్ఎస్, బీజేపీ త‌మ ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయ‌ని ద్వ‌జ‌మెత్తారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైందని, సీయం రేవంత్ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నార‌ని, సాగునీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో క‌లిసి హుటాహుటిన సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నామ‌ని, నిన్న‌టి నుంచి క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నామ‌ని వివ‌రించారు.

ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు 2007లో ప్రారంభమ‌య్యాయ‌ని, అయితే గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌నీసం 10 మీటర్ల సొరంగం ప‌నులు కూడా చేయ‌లేక‌పోయింద‌ని, సాగునీటి ప్రాజెక్ట్ పేరుతో ల‌క్ష‌ల కోట్లు అప్పులు తీసుకువ‌చ్చి, వాటిని పూర్తి చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. మ‌ళ్లీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ ప‌నుల‌ను పూర్తి చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైంద‌ని, అనుకోకుండా ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు.

Latest Articles

‘మ్యాడ్ స్క్వేర్’లో ‘మ్యాడ్’ని మించిన కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్