జేసీపై మంత్రి సత్యకుమార్‌ ఫైర్‌.. బీజేపీకి ఏం సంబంధం?

జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని.. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు. ప్రభాకర్ రెడ్డి వయసుకు తగినట్లుగా మాట్లాడాలని ఆగ్రహించారు. ఎక్కడో బస్సు కాలిపోతే బిజెపికి ఏం సంబంధం అని ఫైర్ అయ్యారు. బీజేపీ దేశవ్యాప్తంగా పరిపాలిస్తున్న పార్టీ అన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
గతంలో ప్రభాకర్ రెడ్డి బస్సులపై , వ్యాపారాలపై,అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటి గురించి నేను మాట్లాడనని చెప్పారు మంత్రి సత్య కుమార్ యాదవ్. కూటమిలో భాగస్వామి అయిన, బిజెపి గురించి ఇలా మాట్లాడకూడదని చురకలు అంటించారు. వ్యక్తిగత సమస్యలు తీసుకువచ్చి, రాష్ట్ర సమస్యలాగా మాట్లాడకూడదన్నారు. అర్థంపర్థం లేని విమర్శలు ,బిజెపి మీద చేయడం సరికాదని ఆగ్రహించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్