నేడు ప్రయివేట్ కాలేజీ యాజమాన్యాలతో మంత్రి సబిత సమావేశం.. ప్రధాన ఎజెండా అదే..

Sabitha Indra Reddy |ప్రయివేట్‌ కళాశాలల్లో విద్యార్థులపై ఒత్తిడి అధికమవుతుందని, దీంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న సాత్విక్ కాలేజీ సిబ్బంది టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మార్చి 6వ తేదీ సోమవారం ఇంటర్మీడియట్‌ కళాశాలల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు M.C.R.H.R.Dలో జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం అవుతారు. ఈ భేటీకి హాజరుకావాలని 14 ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు తెలిపారు.

కార్పొరేట్ కాలేజీల పేరుతో అక్రమాలు జరుగుతున్న సంగతి బట్టబలైంది. ఇంటర్‌ బోర్డు మత్తులో జోగుతుందన్న సంగతి ఎంక్వైరీలో తేలింది. శ్రీచైతన్య స్టూడెంట్‌ సాత్విక్‌ సూసైడ్‌ ఎపిసోడ్‌లో తవ్వేకొద్దీ సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయ్‌. సాత్విక్‌కు నార్సింగి శ్రీచైతన్య కాలేజ్‌లో అడ్మిషనే లేదని ఎంక్వైరీ కమిటీ నివేదికలో తేలింది. అయితే తన కుమారుడి అడ్మిషన్‌, ఫీజుల బిల్లులు అన్నీ నార్సింగి అడ్రస్‌తోనే ఇచ్చారని చెప్పారు సాత్విక్ తండ్రి రాజాప్రసాద్‌. కార్పొరేట్‌ కాలేజీల్లో జరుగుతున్న ఈ బాగోతంపై ఎందుకు చర్యల్లేవో చెప్పాలని డిమాండ్‌ చేశారు సాత్విక్ పేరెంట్స్.

ఈ విషయం శ్రీచైతన్య విద్యాసంస్థ అక్రమాలకు, ఇంటర్‌ బోర్డ్ అలసత్వానికి, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట కాగా.. సాత్విక్ మృతిపై ఐదు రోజుల ఎంక్వైరీలో కమిటీ తేల్చింది దాదాపు శూన్యమని స్పష్టమైంది. సాత్విక్‌ డెడ్‌బాడీకి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగితే రిపోర్ట్‌లో గాంధీ అని రాశారు. దీంతో కమిటీ ఎంక్వైరీ అంతా భూటకమని తేలింది. అయితే ఇవాళ్టి మంత్రి సబిత సమావేశంలో ఇంటర్ బోర్డు షరతులు ఏంటీ? ఎజెండా ఎలా ఉండబోతుంది? కాలేజీల ఓవరాక్షన్ పై చర్యలు తీసుకుంటారా? పిల్లల ప్రాణాలకు ఎటువంటి భరోసా కల్పిస్తారు? సమావేశం తూతూ మంత్రంగా సాగుతుందా? లేక సిరీయస్ యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

 Read Also:  వైజాగ్‌లో ఆ మూవీ కోసం భారీ సెట్‌.. అతగాడికి కెరీర్‌లో మొదటి పాన్‌ ఇండియా మూవీ..

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్‌రావు.. కొందరు కుట్రలు చేశారు

ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్