26.2 C
Hyderabad
Saturday, September 30, 2023

Credit Card Rules |క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదా.. RBI నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

Credit Card Rules |వేతన జీవులతో పాటు చాలా మంది నేటి రోజుల్లో క్రెడిట్ కార్డు వాడటం సర్వసాధారణమైంది. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు కొంతమందికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే క్రెడిట్ కార్డు ఉంది కదా అని అవసరం లేకపోయినా మనకున్న లిమిట్ ఉపయోగించుకుంటే, నెల అయ్యే సరికి వాయిదా కట్టే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది. నెలసరి వాయిదాలు (EMI) సక్రమంగా చెల్లించకపోతే సదరు బ్యాంకులు(BANKS) లేదా సంస్థలు జరిమానా విధిస్తాయి. కొన్ని సందర్భాల్లో భారీ పెనాల్టీలు చూసి అవి చెల్లించలేక క్రెడిట్ కార్డు వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటారు. ఒకోసారి కట్టేందుకు డబ్బులున్నా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాల్సిన తేదీని మర్చిపోతుంటారు. దానివల్ల కూడా వారి క్రెడిట్ స్కోర్ దెబ్బతినంతో పాటు, జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు నిర్ణీత గడువులో కట్టడం మర్చిపోతే జరిమానాలు ఎలా ఉంటాయి. రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

నెలాఖరులో నగదు కొరత ఏర్పడట, ఏదైనా అత్యవసర పరిస్థితుల కారణంగా లేదా బిల్లు కట్టే తేదీ మర్చిపోవడం వంటి వాటి వల్ల సకాలంలో క్రెడిట్ కార్డు వాయిదాలు చెల్లించలేకపోతారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వాయిదా చెల్లించడం మూడు రోజుల కంటే ఆలస్యమైతేనే సదరు బ్యాంకులు లేదా సంస్థలు ఆలస్య రుసుమును విధిస్తాయి. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న విధంగా, చెల్లింపు గడువు దాటిన తరువాత నుండి మాత్రమే అపరాధ రుసుము విధించాలని రిజర్వు బ్యాంకు నిబంధనలు చెబుతున్నాయి. అయితే చాలా మందిలో ఓ అనుమానం ఉంటుంది. క్రెడిట్ కార్డుకు సంబంధించిన వాయిదా (EMI) ఏదైనా ఒక నెల కట్టకపోతే మనం తీసుకున్న రుణం మొత్తానికి ఫెనాల్టీ పడుతుందా అని, రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు వినియోగదారుడు ఆ నెలలో కట్టాల్సిన వాయిదా మొత్తం ఎంత అయితే ఉంటుందో దానికి మాత్రమే అపరాధ రుసుము లేదా లేట్ ఫీజు విధించాల్సి ఉంటుంది.

రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం నిబంధలు పాటించే బ్యాంకులు, సంస్థలు ఓ వ్యక్తి చెల్లించకపోయిన నెల వాయిదా మొత్తం మీద మాత్రమే అపరాధ రుసుమును విధిస్తాయి. లేట్ ఫీజు విషయంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. క్రెడిట్ కార్డు జారీ చేసిన సమయంలోనే వాయిదా కట్టడంలో విఫలమైతే ఎంత ఆలస్య రుసుము విధిస్తారనేది స్పష్టం చేస్తారు. ఆ విధంగా మాత్రమే ఛార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ లేట్ ఫీజు లేదా వడ్డీల్లో ఏవైనా మార్పులు చేసినా, రేట్లను పెంచినా క్రెడిట్ కార్డు వినియోగదారుడుకి ఒక నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే ఛార్జీలను మార్చగలరు. ఒక వేళ బ్యాంకులు లేదా ఏవైనా సంస్థలు విధించిన ఛార్జీలు ఎక్కువుగా ఉన్నాయని, రీజన్ బుల్ గా లేవని భావిస్తే అన్ని బకాయిలు చెల్లించిన తర్వాత క్రెడిట్ కార్డ్‌ని సరెండర్ చేయవచ్చు. అలా క్రెడిట్ కార్డును వదులుకున్నప్పుడు ఎటువంటి అదనపు ఛార్జీని విధించకూడదు. విధిస్తే రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది.

మీ క్రెడిట్ కార్డును సరెండర్ చేయడం కోసం దరఖాస్తు చేసుకుంటే రిజర్వు బ్యాంకు ఇండియా ఆదేశాల ప్రకారం మీ దరఖాస్తు అభ్యర్థనను ఏడు పనిదినాల్లో ప్రాసెస్ చేసి, పరిష్కారం చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఏడు పని దినాల్లో సమస్య పరిష్కారంలో విఫలమైతే క్రెడిట్ కార్డు అకౌంట్ ను క్లోజ్ చేసే వరకు ఆలస్యమైనందుకు రోజుకు రూ.500 జరిమానాగా వినియోగదారుడుకి చెల్లించాల్సి ఉంటుంది.

 Read Also:  అమెరికా అధ్యక్షుడినైతే FBI రద్దు చేస్తా: వివేక్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

మలయాళ ఇండస్ట్రీలోకి ‘లైకా’ ఎంట్రీ!

మ‌ల‌యాళ సినిమా ఇండ‌స్ట్రీ అంటే కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ ముందుకు సాగిపోతుంది. కొన్నేళ్లుగా ఓ ప‌రిప‌క్వ‌త‌, గాఢ‌మైన సినిమాల‌ను చేయ‌టంలో వీరు త‌మదైన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్