ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు: పెద్దిరెడ్డి

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి వెళ్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని.. అందుకే వేరే రాజకీయ పార్టీలపై ఆధారపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక జనసేనాని తానేం మాట్లాడేది లేదని వ్యంగ్యంగా స్పందించారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏటీబీ మిషన్‌ను ఆయన ప్రారంభించారు. అంటే ఏటీబీ మిషన్‌లో రూ.10 నాణెం వేస్తే బ్యాగ్ వచ్చేలా దీనిని ఏర్పాటుచేశారు.

 

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్