స్వతంత్ర, వెబ్ డెస్క్: నిర్మల సభలో కాంగ్రెస్ పార్టీ పై సీఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ మెప్పు పొందడం కోసమే కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలన్న కేసిఆర్.. కవితను లిక్కర్ స్కాం నుండి కాపాడుకోవడానికి బీజేపీతో కుమ్ముక్కయ్యారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచిత విద్యుత్ అమలు చేసి.. ఏక కాలంలో రైతులకు లక్ష రూపాయలు రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దేనని అన్నారు. తెలంగాణా ప్రజల ఆకాంక్ష నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ లాంటి స్వార్ధ రాజకీయ నాయకుడు సోనియాగాంధీ స్థానంలో ఉంటే ఇప్పటికీ తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. రేపు ఎవరిని ఎవరూ బంగాళాఖాతంలో కలుపుతారు అనేది ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.
బీజేపీతో కుమ్మక్కయిన కేసీఆర్: జీవన్ రెడ్డి
0
283
- Tags
- Jeevan Reddy
- KCR
Previous article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


