కోకాపేటలో భారత్ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో భారత్ భవన్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ భవనానికి ‘భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్‌లెన్స్ అండ్ హెచ్ఆర్డీ’గా నామకరణం చేశారు. కోకాపేటలో మొత్తం 11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో దీనిని నిర్మించనున్నారు. ఇందులో కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. స్టేట్‌ ఆర్ట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, డిజిటల్ లైబ్రరీతో పాటు శిక్షణ పొందేవారికి, పనిచేసే సిబ్బందికి సదుపాయాలు కల్పించనున్నారు.

పార్టీ అధినేత కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడున్న జాతీయ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్‌ పనులు చూసుకుంటారు. మిగతా సమయాల్లో భారత్‌ భవన్‌ నుంచే పార్టీ పనులన్నీ చూడనున్నారు. అయితే కోకాపేటలో చదరపు గజం రూ.లక్ష నుంచి లక్షన్నర పలుకుతుండగా.. ప్రభుత్వం కేవలం చదరపు గజం రూ.7,500 చొప్పున 11 ఎకరాలను బీఆర్‌ఎస్‌కు కట్టబెట్టిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం రూ.500కోట్ల విలువ చేసే స్థలాన్ని కేవలం రూ.40 కోట్లకే ప్రభుత్వం తమ పార్టీకి కేటాయించుకోవడంపై మండిపడుతున్నాయి.

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్