శ్రీశైలంలో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. టీటీడీ తరుపున తెలంగాణలో ధర్మప్రచార, నిధులను కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వం పాటించిన విధానాలని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయాలని కొండా సురేఖ కోరారు.