ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట పట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజానగరం విద్యుత్ ఆఫీస్ వద్ద అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారంటీ అంటూ దగా చేస్తోందని రాజా మండిపడ్డారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లు వేయించుకున్న కూటమి సర్కార్ ఇప్పుడు ఆ ప్రజలనే బాదుతోందని ఆయన విమర్శించారు. విద్యుత్ రంగాన్ని నిట్టనిలువునా ముంచేసింది చంద్రబాబు నాయుడు అని జక్కంపూడి రాజా ఆరోపించారు.