మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని మాజీ ఎంపీ వీ. హనుమంతరావు అన్నారు. ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలిపారని కొనియాడారు. సోనియా గాంధీకి రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా.. ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్‌ను ప్రధాని చేశారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్‌తో కలసి పని చేసే అవకాశం ఓబీసీ కన్వీనర్‌గా ఉన్న సమయంలో తనకు వచ్చిందని చెప్పారు. కేంద్ర క్యాబినెట్ తీసుకునేందుకు తన పేరును కూడా మన్మోహన్ సింగ్ పరిశీలించారని.. చివరకు ఆ అవకాశం తనకు దక్కలేదన్నారు.