ఆపదలో ఉన్న వారు తన తలుపు తడితే చాలు వారికి అండగా నిలబడతానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. చెప్పినట్టుగా ఓ అనాథ బాలికకు మంత్రి కోమటిరెడ్డి అండగా నిలిచారు. తల్లిదండ్రులు చనిపోయి అనాథగా మారిన బాలిక దుర్గ బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు. ప్రతి నెలా నగదు పంపిస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో బాలికను కలిసి మరింత భరోసా నింపుతానని ప్రకటించారు. ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి లక్ష రూపాయలు అందించారు మంత్రి.