స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని మంచిర్యాలలో దారుణం జరిగింది. జిల్లాలోని మునిసిపల్ కార్యాలయం ముందు మహిళ దారుణ హత్యకు గురైంది. టూ వీలర్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న స్వప్న శ్రీ అనే మహిళను కత్తితో నరికారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. నిందితులు TS19E7695 బైక్ పై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు స్వప్నకు రెండో భర్తతో భూవివాదం తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోటపల్లి మండలంలో ఉన్న భూమి విషయంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్న స్థానిక సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, మహిళపై గల దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: పట్టపగలే మహిళ దారుణ హత్య
0
500
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


