మెగాస్టార్ చిరంజీవిని కలిశారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఆయనకు చిరంజీవి స్వాగతం పలికి అనంతరం సన్మానించారు. ఇక ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రితో మాట్లాడారు. చిరంజీవి ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకంక్షలు తెలిపారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుం టానని చెప్పారని, ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానని, విశ్వసిస్తున్నాను అని పోస్ట్ చేశారు.
విశ్వంభర షూటింగ్ సెట్‌లో చిరును కలిసిన మంత్రి కందుల
0
227
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


