మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు

డాక్టర్ సి. హెచ్. ప్రీతి రెడ్డి మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్‌గా వైద్య విద్యారంగంలో అందరికీ మంచి ఆరోగ్యం అందించడంలో తనదైన ముద్రను వేసుకుంటున్నారు. అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్‌గా అందరికీ ముఖ్యంగా మహిళలకు ఉన్నత విద్యను అందించడంలో సహాయపడుతున్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీలో రెండు మెడికల్ కాలేజీలు, రెండు డెంటల్ కాలేజీలు, అదేవిధంగా మల్లారెడ్డి మహిళా కాలేజ్ ఉన్నాయి. ప్రతి మెడికల్ కాలేజ్ నుంచి 200 ఎంబిబిఎస్ సీట్లు ప్రత్యేకంగా ఆడవారి కోసమే కేటాయించారు. అత్యున్నత వైద్య సదుపాయాలతో మంచి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ప్రీతి రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ తెలంగాణలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీగా పేరుగాంచింది. అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కింద స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ హెల్త్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లాంటి సిక్స్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతిఏటా యూనివర్సిటీ ద్వారా 5000 మందికి అడ్మిషన్ సీట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. మల్లారెడ్డి కోడలుగా, మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ గా, మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ గా వైద్య, విద్య రీత్యా ప్రజలకు, విద్యార్థులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు.

డాక్టర్ ప్రీతి చేస్తున్న సేవల దృష్ట్యా ఆమెను ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ వరించింది. గతంలో ఈ అవార్డును కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ రామ్ నాయక్‌కు, బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి, సోను సూద్‌కి, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అందుకున్నారు.

ప్రస్తుతం 2024 సంవత్సరానికి గానూ మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్‌ ప్రీతిరెడ్డిని ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు వరించింది. మాజీ చీఫ్ జస్టిస్, మానవహక్కుల సంఘం మాజీ చైర్మన్ కేజీ బాలకృష్ణన్ చేతుల మీదుగా ప్రీతిరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్