స్వతంత్ర, వెబ్ డెస్క్: కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వటకరలోని ఓ కార్యక్రమానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా కైపమంగళం వద్ద ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సుధి తలకు తీవ్ర గాయాలు కావడంతో కొడుంగల్లూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ అయిన సుధి.. కొట్టప్పనయిలే రిత్విక్ రోషన్, కుట్టనదన్ మరప్పప్ప సహా పలు సినిమాల్లో నటించాడు. ఆయన మరణ వార్తతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది. సుధి మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు దుర్మరణం
0
337
Previous article
Latest Articles
కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం పాట
బాలాపూర్ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయయ్యాయి. గణపతిని వాహనంపైకి ఎక్కించారు. కాసేపట్లో గ్రామ ప్రదిక్షణ ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పోటీలో నిలిచారు. ఇప్పటికే...
- Advertisement -
- Advertisement -


