భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో దారుణం జరిగింది. రవాణా శాఖ కార్యాలయం ఎదుట రవాణా అధికారి (డీటీవో) వెంకన్న వాహనాలను తనిఖీ చేస్తుండగా బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆయనపైకి దూసుకెళ్లింది. దీంతో వెంకన్న అక్కడిక్కడే మృతి చెందాడు. 25 రోజుల క్రితమే DTO వెంకన్న బదిలీపై వచ్చారు.
DTO వెంకన్న మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


