హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి భరత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆరేసిన బట్టల విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బుజ్జి అనే మహిళ తమ్ముడు శంకర్‌పై బటన్ చాకుతో మెడ కోసి కలమ్మ అనే మహిళ సోదరుడు హత్యాయత్నం చేశాడు. నిందితుడు చాకుతో శంకర్ మెడ కోయటంతో పరిస్థితి విషమంగా మారింది. బాధితుడు శంకర్ పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.