‘ద్రోహి’ ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ చేసిన డైరెక్టర్ క్రిష్

సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా గుడ్‌ ఫెల్లోస్‌ మీడియా ప్రొడక్షన్స్‌, సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ‘ద్రోహి’. ది క్రిమినల్‌ అన్నది ఉపశీర్షిక. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌ పెందుర్తి, రాజ శేఖర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్‌ మాట్లాడుతూ ‘‘సినిమాకు సంబంధించిన లుక్‌, గ్లింప్స్‌ చూశాను. చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయి. సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ మంచి పేరు తెచ్చుకుని సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నాను. టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు’’ అని అన్నారు.

దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘చక్కని థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు.

నటీనటులు
సందీప్‌ కుమార్ బొడ్డపాటి
దీప్తి వర్మ,
డెబి,
షకలక శంకర్‌,
నిరోజ్‌,
శివ,
మహేష్‌ విట్ట,
మెహ్బూబ్‌,
చాందినీ గొల్లపూడి తదితరులు.

సాంకేతిక నిపుణులు
కెమెరా: అశోక్‌ దబేరు,
ఎడిటర్‌: జానీ బాషా
సంగీతం: అనంత్‌ నారాయణ
డిఐ : రక్షిత్‌కుమార్‌ గజ్జల
లిరిక్స్‌ : నరేంద్రకుమార్‌
రచయిత: గణేష్
కో డైరెక్టర్ : రామ్ సాయి ముంగ
పీఆర్వో : మధు వి.ఆర్‌.

Latest Articles

నటనకు దక్కిన గౌరవం.. అనంత్‌ నాగ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

  కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్‌ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు అనంత్‌ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్