‘ఖుషి’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..

స్వతంత్ర వెబ్ డెస్క్: డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ .. సమంత కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ఇప్పటికే ఈ సినిమా మీద ఓ హైప్ క్రియేట్ కాగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో అప్డేట్ చక్కర్లు కొడుతుంది. ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అంటూ ప్రేమికులందరినీ కట్టిపడేసిన మేకర్స్.. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేశారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ఇప్పుడు ప్రేమికుల గీతంగా నిలిచిపోయేలా ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ప్రేమకథా చిత్రాలను మంచి ఫీల్ తో తెరకెక్కించగలడనే పేరు శివ నిర్వాణకి ఉంది. తనదైన శైలిలో ఆయన రూపొందించిన ఈ సినిమా, సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ గా మరో సాంగును రిలీజ్ చేశారు. ‘పదమునీవైపిలా .. పరుగు నీవే కదా, తనువు తెరమీదుగా .. చేరుకో త్వరగా’ అంటూ ఈ పాట సాగుతోంది. హేషం అబ్దుల్ వాహెబ్ స్వరపరిచిన ఈ పాటకి శివ నిర్వాణ సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ – చిన్మయి ఆలపించారు. మరీ ముఖ్యంగా ఈ పాటలో శివ నిర్వాణ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది. బీట్ కొత్తగా ఉంది .. మంచి ఫీల్ వర్కౌట్ అయింది. సినిమాలో పాటకి తగిన విజువల్స్ పడితే, ఈ పాట బ్యూటీ మరింత పెరిగే అవకాశం ఉంది. సచిన్ ఖేడేకర్ .. జయరామ్ .. మురళీ శర్మ .. వెన్నెల కిశోర్ .. లక్ష్మి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా హిట్ అటు విజయ్ దేవరకొండకి .. ఇటు సమంతకి చాలా అవసరమే.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్