స్వతంత్ర వెబ్ డెస్క్: డొమినికా వేదికగా భారత్ – వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో విండీస్ 25 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతోంది. భారత్ ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి విండీస్ 29 పరుగులు చేసింది. కానీ ఒక్క వికెట్ పడలేదు. ఆ తర్వాత కాసేపటికే అశ్విన్ బౌలింగ్ లో చందర్ పాల్ ఔటయ్యాడు. ఆ తర్వాత బ్రాత్ వైట్ కూడా అశ్విన్ బౌలింగ్ లోనే పెవిలియన్ కు చేరాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో రీఫర్ అవుటయ్యాడు. విండీస్ 28 ఓవర్లకు 68 పరుగులు చేసింది.