స్వతంత్ర వెబ్ డెస్క్: ఉత్తరాదిన భారీ వర్షాలు జల విలయం సృష్టించాయి. పలు రాష్ట్రాల్లో వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమయింది. హరియాణాలోనూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్ర మంత్రి నివాసంలోనూ వరద నీరు చేరింది. అంబాలాలో హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ నివాసంలోకి భారీగా వరద నీరు (Flood Water) వచ్చింది. అనిల్ ఇంటి ముందు మోకాలిలోతు నీరు చేరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంబాలాలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అనిల్ విజ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి విధి నిర్వహణ చేపట్టారు. బోటులో నగరమంతా తిరిగి పరిస్థితులను పర్యవేక్షించారు. వరద ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వరదలు కారణంగా 10మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తమైన యంత్రాంగం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ను రంగంలోకి దింపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది.
వరద నీటిలో హోం మంత్రి ఇల్లు..
Latest Articles
- Advertisement -