ఖమ్మం పర్యటనలో దళిత బంధు పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ధళిత పథకం కింద విడుదలైన నిధులు దుర్వినియోగం అయ్యాయని తన దృష్టికి వచ్చినట్టు తెలిపారు. కలెక్టర్ల తనిఖీల్లో ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఈ దుర్వినియోగంలో లబ్దిదారుల పాత్ర ఎంత ఉన్నదో.. ప్రత్యేక అధికారుల పాత్ర కూడా అంతే ఉంటుందని వివరించారు. పథకాన్ని నిర్వీర్యం చేసిన.. నిధుల దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లబ్దిదారుల వద్దే వారు కోరుకున్న యంత్రాలు, ఇతరత్రాలు ఉండాలని స్పష్టం చేశారు.