సోషల్ మీడియా వేదికగా… కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు

   బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్, ఇన్స్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరిచారు. పార్టీ పరంగా ప్రత్యేక సోషల్ మీడియా అకౌంట్ ఉన్నప్పటికి వ్యక్తిగతంగా ఆయన ఇప్పటి వరకు అకౌంట్ ఓపెన్ చేయలేదు. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఖాతా తెరిచిన నిమిషాల్లోనే వేలాది మంది ఫాలోవర్లు కేసీఆర్ ను ఫాలో అయ్యారు.

   గులాబీ బాస్ కేసీఆర్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఎక్స్‌లో అకౌంట్ ఉంది. తాజాగా KCRBRSPresident పేరుతో ఆయన సొంతం గా ఎక్స్‌ ఖాతా ప్రారంభించారు. ఇకపై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత వరుస ప్రచారాలు, సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ వైఫల్యాలే టార్గెట్‌గా విమర్శలకు పదను పెడుతున్నారు. అయితే ప్రజలతో మమేక మయ్యే కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ సోషల్ మీడియాను మీడియా ద్వారా విస్తృతంగా ప్రజలకు దగ్గర కావాలని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తాజాగా ఎక్స్, ఇన్స్‌స్టాగ్రామ్‌లో అకౌంట్లు తెరిచినట్లు సమా చారం. సోషల్ మీడియాలో కేసీఆర్ యాక్టివ్ కావడంతో చాలా విషయాలు చెప్పుకోవ చ్చనే యోచనలో ఆ పార్టీ కేడర్ ఉంది. దీంతోపాటు ప్రజా సమస్యలు,ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఉపయోగపడుతోందని కేటార్ అభిప్రాయపడుతున్నారు.

   మరోవైపు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చీ ఇవ్వంగానే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే తనకు ఎదురైన సంఘటననుపంచుకున్నారు. మహబూబ్ నగర్ లో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయిందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. నియోజకవర్గాల్లో రోజుకు పదిమార్లు కరెంట్ పోతోందని మాజీ శాసనసభ్యులు ఆ సందర్భంగా తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే మహబూబ్‌నగర్‌లో కరెంట్‌ కోతలపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర విద్యుత్ సంస్థ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ స్పందిం చింది. ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఎలాంటి విద్యుత్‌ అంతరాయం లేదని స్పష్టం చేసింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో రెండుసార్లు కరెంట్ పోయిందనేది కూడా అవాస్తవమని బదులిచ్చింది. మొత్తానికి రాజకీయాల్లో ఉన్న నేతలంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. తాము చెప్పాలని అనుకున్న అంశాలను నేరుగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్టు చేస్తూ తమ ప్రత్యర్ధి పార్టీలపైనేతలపై విమర్శలు సంధిస్తున్నారు. అందుకే ఇప్పటివరకు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వని కేసీఆర్..ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎక్స్‌ ఖాతాలోకి అడుగుపెట్టారనే చర్చ జరుగు తోంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్