కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై నకిలీ వీడియోకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా పై ఫేక్ వీడియో విడుదల చేశారనే అరోపణ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన తప్పుడు వీడియోను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని వివిధ సెక్షన్లు, ఐటీ చట్టంలోని సంబంధిత నిబంధన కింద స్పెషల్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వారికి రిజర్వేష న్ కోటాలను రద్దు చేయాలని అమిత్ షా వాదిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. కమ్యూనిటీల మధ్య విభేదాలు సృష్టించే ఉద్దేశ్యంతో కొన్ని నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తు న్నారని, దీనివల్ల శాంతి, భద్రతనుకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అధికారి శరణ్ సింగ్ ఫిర్యాదుతో ఈ ఎఫ్ ఐఆర్ దాఖలైంది. వీడియో తయారీ దార్లను కనిపెట్టేందుకు ఆరా తీస్తున్నారు.


