37.2 C
Hyderabad
Friday, May 1, 2026
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

పులివర్తి వినీల్ ఎన్నికల ప్రచారం

తిరుపతి మండలం వేమూరు గ్రామంలో పులివర్తి వినీల్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వాడవాడలా తిరుగుతూ ఓట్లను అభ్యర్ధించారు. పలువురు నేతలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. పులివర్తి నానిని గెలిపించుకుంటామన్నారు నేతలు.

జై భారత్‌ నేషనల్‌ పార్టీకి టార్చ్‌లైట్‌ గుర్తు

సీబీఐ మాజీ డైరెక్టర్‌ జెడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్‌ నేషనల్‌ పార్టీకి టార్చ్‌లైట్‌ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు రాష్ట్ర సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆ పార్టీ పోటీ చేయనున్న నియోజకవర్గాల్లో టార్చ్‌లైట్‌ గుర్తును కేటాయించాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లకు సమాచారం వెళ్లింది.

టీడీపీలో చేరిన యోగి పోసాని

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు పోసాని యోగేంద్రనాథ్‌ టీడీపీలో చేరారు. కర్నూల్‌ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు అంటే ఒక విజన్‌ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమౌ తోందన్నారు యోగేంద్రనాథ్‌.

మే 19న సీతమ్మ ఆలయ ప్రతిష్ట

శ్రీలంకలో సీతమ్మ అమ్మవారి ఆలయం ఏర్పాటు కానుంది. ఆలయ ప్రతిష్ఠాపన మే నెల 19 న జరగ నుంది. ఇందుకోసం సరయు నది నుంచి పవిత్ర జలాలను శ్రీలంకకు పంపే ప్రక్రియను ప్రారంభించింది భారత్‌. కలశంలో పవిత్ర జలాన్ని అందించనున్నట్లు అయోధ్య తీర్థ వికాస్‌ పరిషత్‌ సీఈవో సంతోష్‌ కుమార్ శర్మ తెలిపారు.

బీజేపీ ఎంపీ శ్రీనివాస ప్రసాద్

కర్ణాటక రాష్ట్ర చామరాజనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ ఈ ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 76 ఏళ్లు. అనారోగ్యం బారినపడ్డ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వాజ్‌పేయ్‌ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేసారు. ఆరుసార్లు చామరాజనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. శ్రీనివాస్‌ ప్రసాద్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌ వేదికగా సంతాపం ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అంటూ గుర్తు చేసుకున్నారు.

టీచర్ కి కార్ గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు

లేపాక్షి నవోదయ పూర్వ విద్యార్ధులు గురువుకు కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మద్దిరాల జవహర్‌ నవోదయ విద్యాలయం చిత్రలేఖనం ఉపాధ్యాయుడుగా ఉన్నారు. ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో జేమ్స్‌ను సత్కరించి, 12 లక్షల రూపాయల విలువైన కారును గురుదక్షిణగా అందజేసారు పూర్వ విద్యార్ధులు.

అగ్ని ప్రమాదం

కర్నూలు నగరంలోని అబ్దుల్లాఖాన్ ఎస్టేట్ లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటల్ని అదుపుచేసారు. ఈ ఘటనతో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్లే పేలుళ్లు సంభవించినట్లు భావిస్తున్నారు.

అనుమానస్పద మృతి

మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 35 సంవత్సరాల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వికలాంగుల కాలనీ సమీపంలో పడి వున్న మృతదేహంపై గాయాలున్నాయి. అనుమానా స్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఘోరమైన రోడ్డు ప్రమాదం

అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం కోన లోవ పంచాయతీ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడ్ని గుడ్ల లక్ష్మీ గణపతిగా గుర్తించారు. గాయపడ్డ కోటం జగదీష్, మడకం శివశంకర్ లను చికిత్సకొరకు అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

భారత్ షూటర్ ఒలింపిక్స్ కు అర్హత

భారత షూటర్‌ మహేశ్వరి చౌహాన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. దోహాలో జరుగుతున్న షాట్‌గన్‌ ఫైనల్‌ ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ చాంపియన్‌షిప్‌లో స్కీట్‌ విభాగంలో రజతం గెలుచుకుంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మహేశ్వరి 121 స్కోర్‌ చేసి ఒలింపిక్స్‌ కోటాను పొందడటమే కాకుండా జాతీయ రికార్డు నెలకొల్పింది.

టీ20 వరల్డ్ కప్ కు న్యూజిలాండ్ టీం ఫైనల్

టీ 20 వరల్డ్‌ కప్‌ జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ ప్రకటించింది. 14మంది సభ్యులతో జట్టును ప్రకటించిన బోర్డు స్టార్‌ ప్లేయర్‌ విలియమ్సన్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. జూన్‌లో జరగనున్న టీట్వంటీ వరల్డ్‌ కప్‌కు అమెరికా, వెస్టీండీస్‌ దేశాలు సంయుక్తంగా అతిధ్యమిస్తున్నాయి. బౌల్డ్‌, బ్రేస్‌వెల్‌, కాన్వే, ఫెర్గూసన్‌, డారిల్‌ మిచెల్‌, రచీన్ రవీంద్ర, సాంటర్న్‌, సోధీ, సౌథీలతోపాటు మరో ఐదుగురికి జట్టులో స్ధానం దక్కింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్