తెలంగాణ ఉద్యమంలో మహత్తర ఘట్టం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహార దీక్ష. 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు కేసీఆర్ బయల్దేరుతున్న సమయంలో అప్పటి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. కరీంనగర్ శివారులోని అల్గునూర్ దగ్గర కేసీఆర్ ను అరెస్టు చేసి ఖమ్మం తరలించింది. కేసీఆర్ అరెస్టుతో యావత్ తెలంగాణ సమాజం భగ్గున మండిపడింది. కేసీఆర్ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ ప్రజలు రోడ్డెక్కారు. ఆ తరువాత అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణకమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. అంతిమంగా 2014 జూన్ రెండో తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దశాబ్దాల తెలంగాణ ప్రజల కల సాకారమైంది.
తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీయే శ్రీకృష్ణకమిటీ . ఆంధ్రప్రాంతం అలాగే తెలంగాణలో వెనుకబాటుతనం ఏ స్థాయిలో ఉందో పరిశీలించడానికి శ్రీకృష్ణకమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభు త్వం. శ్రీకృష్ణ కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో 2010, డిసెంబర్ 30న శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 20 కోట్లు ఖర్చు చేసింది. అయితే శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై 2011, జనవరి ఆరో తేదీన అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో మరింత జాప్యం చేస్తోందని గులాబీ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో చిదంబరం అఖిలపక్ష సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ బహిష్కరిం చాయి. కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని పార్టీలు మాత్రమే హాజరయ్యాయి.
శ్రీకృష్ణకమిటీ తమకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందన్నది తెలంగాణ సమాజం వాదన. దీంతో కమిటీ నివేదికకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించింది. శ్రీకృష్ణకమిటీ నివేదికకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద భారీస్థాయిలో ధర్నా నిర్వహించాయి. తెలంగాణవ్యాప్తంగా కమిటీ నివేదికను దహనం చేస్తూ నిరసన ప్రదర్శనలు ప్రతిరోజూ జరిగాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, శ్రీకృష్ణ కమిటీ పక్షపాతాన్ని నిరసిస్తూ తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి 2010, జనవరి 7న బంద్ నిర్వహించింది. తెలంగాణ ఉద్యమంలో మహత్తర ఘట్టం కల్వకుంట్ల చంద్రశే ఖరరావు నిరాహార దీక్ష. 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు కేసీఆర్ బయల్దేరుతున్న సమయంలో అప్పటి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. కరీంనగర్ శివారులోని అల్గునూర్ దగ్గర కేసీఆర్ ను అరెస్టు చేసి ఖమ్మం తరలించింది. అయితే కేసీఆర్ మనోధైర్యాన్ని కోల్పోలేదు. అకుంఠిత దీక్షతో కేసీఆర్ తన దీక్షను కొనసాగించారు.
కేసీఆర్ అరెస్టుతో యావత్ తెలంగాణ సమాజం భగ్గున మండిపడింది. కేసీఆర్ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ ప్రజలు రోడ్డెక్కారు. మా తెలంగాణ మాగ్గావాలె అంటూ కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమిం చింది తెలంగాణ సమాజం. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ తెలంగాణ సమాజంలో నెల కొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభి స్తున్నాం అంటూ 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తరఫున అప్పటి కేంద్ర మంత్రి పి. చిదంబరం ఈ ప్రకటన చేశారు. డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటనతో తెలంగాణ సమాజం లో ఆనందం పెల్లుబుకింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినట్లే ప్రజలు భావించారు. కొంతమంది ఆనందాన్ని ఆపుకోలేక సంబురాలు కూడా చేసుకున్నారు. అయితే డిసెంబర్ తొమ్మిది నాటి చిదంబరం ప్రకటనను ఆంధ్రప్రాంతంలోని నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంపై ఆంధ్ర ప్రాంతంలోని అన్ని పార్టీల నాయకులు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడలేదు. తెలంగాణ ఏర్పాటుపై మాట మార్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును జాప్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చిదంబరం ప్రకటించారు. దీంతో తెలంగాణ సమాజం భగ్గున మండింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మరోసారి పదవులకు రాజీనామాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా, తెలంగాణ సాధన కోసం ఉద్యమకారులు తమ పోరాటం ఎక్కడా ఆప లేదు. ఈనేపథ్యంలో 2013 అక్టోబరులో తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలియచేసింది. తెలం గాణ బిల్లుకు 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపాయి. లాంఛనాలన్నీ పూర్తికావడంతో. ప్రత్యేక తెలంగాణ బిల్లుకు 2014 మార్చి ఒకటోతేదీన రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో 2014 జూన్ రెండో తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దశాబ్దాల తెలంగాణ ప్రజల కల ఫలించింది. ఇదిలా ఉంటే దాదాపు రెండేళ్ల కిందట జాతీయ రాజకీయా ల్లో కీలక పాత్ర పోషించాలని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించు కున్నారు. ఇందులో భాగంగానే జాతీయ పార్టీని ఆయన ప్రకటించారు. 2022 టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో గులాబీ పార్టీ నేత పల్లా రాజేశ్వర రెడ్డి ఈమేరకు ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర సమితిగా మారింది. టీఆర్ఎస్ ..బీఆర్ఎస్ గా మారడంతో క్యాడర్‌లో జోష్ నెలకొంది. కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
భారత్ రాష్ట్ర సమితిని ఒక జాతీయ పార్టీగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ తీవ్ర కృషి చేశారు. దీని వెనుక ఒక గొప్ప విజన్ ఉంది. భవిష్యత్ దేశ రాజకీయాలపై దూర దృష్టి ఉంది. దేశంలో నెలకొన్న పరిస్థితులపై కేసీఆర్ మనసులో గూడు కట్టుకున్న ఆవేదన ఉంది. భారత్ రాష్ట్ర సమితిని దేశవ్యాప్తంగా విస్తరించడం లో భాగంగా కేసీఆర్ పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఆ తరువాత ఔరంగాబాద్‌లోనూ బీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. మహారాష్ట్రలో నీటి ఎద్దడి గురించి ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో నీటి ఎద్దడి అనేదే లేకుండా చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆరుగాలం కష్టపడే అన్నదాతను కేంద్రంగా చేసుకుని ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనా విధానానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అబ్ కీ బారీ కిసాన్ కిసార్ సర్కార్ నినాదాన్ని భుజానికెత్తుకున్నారు ఆయన. అయితే ఆర్నెల్ల కిందట జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు. గులాబీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కూడా ప్రారంభమయ్యాయి. భారత్ రాష్ట్ర సమితిలో కీలక నాయకులుగా ఉన్న కే. కేశవ రావు, కడియం శ్రీహరి లాంటి వారు పార్టీ వీడారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఒకదశలో లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పినా, పోటీ చేయడానికి నాయకులు దొరకని పరిస్థితి బీఆర్ఎస్ లో ఏర్ప డింది. అయితే ఎన్నికల్లో జయాలు, అపజయాలు సహజం అంటున్నారు గులాబీ పార్టీ నేతలు ఈ అవరోధాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ రానున్న రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళతామంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటముల సంగతి ఎలాగున్నా, ప్రత్యేక తెలంగాణ తీసుకువచ్చిన ఘనత మాత్రం గులాబీ పార్టీ స్వంతం చేసుకుంది.


