తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నువ్వా-నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి కాంగ్రెస్, బీజేపీ. గతేడాది వరకు చక్రం తిప్పి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లో పెద్దగా లేదని తేల్చిచెప్పాయి ఎగ్జిట్ పోల్స్. రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 9 ఎంపీ సీట్లు దక్కవచ్చని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. అటు బీజేపీ కూడా ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు కైవసం చేసుకునే అవకాశా లున్నాయని తెలిపాయి ఎగ్జిట్ పోల్స్. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఒకటి నుంచి రెండు ఎంపీ స్థానాలు దక్కవ చ్చని తేల్చాయి.ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేశారు. బీజేపీకి 8 నుంచి 9 స్థానాలు దక్కుతాయని లెక్కలు వేశారు. ఇక, బీఆర్ఎస్‌కు ఒక స్థానం కూడా దక్కదని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది.ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆరు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కమలనాథులు 8 నుంచి 10 సీట్లలో గెలవచ్చని అభిప్రాయ పడింది. బీఆర్‌ఎస్‌కు ఒక సీటు దక్కవచ్చని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్‌లో హస్తం పార్టీ ఆరు నుంచి 9 స్థానాలు కైవసం చేసుకోవచ్చని ప్రకటించింది. బీజేపీ ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కించుకోవచ్చని తెలిపింది. ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్‌పోల్‌లో కాంగ్రెస్, బీజేపీకి చెరో ఏడు నుంచి 9 స్థానాలు వస్తాయని లెక్కలేసింది. గులాబీ పార్టీ ప్రభావం ఏమీ ఉండబోదని తేల్చింది. జన్‌కీబాత్‌లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు నుంచి ఏడు సీట్లు, బీజేపీ 9 నుంచి 12 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని ప్రకటించింది. బీఆర్ఎస్‌కు ఒక సీటు వరకు రావచ్చని తెలిపింది. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్‌లో బీజేపీకి ఏడు నుంచి పది సీట్లు రావచ్చని లెక్కలేసింది. కాంగ్రెస్‌కు ఐదు నుంచి 8 ఎంపీ సీట్లు, బీఆర్ఎస్‌కు రెండు నుంచి ఐదు పార్లమెంటు స్థానాలు దక్కవచ్చని ప్రకటించింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో నువ్వానేనా అంటున్న కాంగ్రెస్, బీజేపీ
0
178
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


