29.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

కవిత బెయిల్‌ బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ రెండింటికీ విజయం – బండి సంజయ్‌

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. వారి అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయని చెప్పారు.

ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్… రెండు పార్టీల విజయమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్‌పై బయటకు వచ్చారని… ఇదే సమయంలో కాంగ్రెస్‌ వ్యక్తి రాజ్య సభకు వెళ్లారని చెప్పారు. కవితకు బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపించిన కాంగ్రెస్ అభ్యర్థిని కాంగ్రెస్‌ ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపిందని సింఘ్వీని ఉద్దేశించి అన్నారు.

Latest Articles

చాంద్రాయణగుట్టలో హిట్ అండ్ రన్.. నవవివాహిత దుర్మరణం

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టిప్పర్ లారీ ఢీకొట్టడంతో నవవివాహిత ఫాతిమా బేగం(25) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్