గణేష్ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలను కలుపుకొనిపోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ట్యాంకుబండ్‌పై జరిగే గణేష్ సామూహిక నిమజ్జనం ఏర్పాట్లకు ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. గణేష్ ఉత్సవాలకు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, బాలాపూర్ ఉత్సవ కమిటీ, హైదరాబాదులోని అన్ని ఉత్సవ కమిటీల సమన్వయం అవసరం అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు, నిమజ్జనం, శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ అధికారులతో అన్ని విభాగాల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పాల్గొని మాట్లాడారు.