అక్టోబర్‌లో జేడీ చక్రవర్తి ‘హు’

జేడీ చక్రవర్తి హీరోగా, శుభ రక్ష, నిత్య హీరోయిన్స్‌గా రూపొందిన చిత్రం ‘హూ’. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. తాజాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘హు’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ కె. బాలాజీ మాట్లాడుతూ… జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ఎమోషనల్‌ థ్రిల్లర్‌ మూవీ’ హూ’. ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో చిత్రీకరించాం. అలాగే అనేక థ్రిల్లింగ్‌ అంశాలు కూడా ఉన్నాయి. క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులను అందరినీ అలరించేలా కంటెంట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. ఇటీవలే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. అక్టోబర్‌ తొలి వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

జేడీ చక్రవర్తి, శుభ, నిత్య, వినయ్‌ ప్రసాద్‌, విజయ్‌ చందర్‌, సునీల్‌ పూర్ణిక్‌, రమేష్‌ పండిట్‌, హర్షిత, ఉగ్రం రవి, శరణ్య, సనత్‌, నాగేంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్‌ చంద్‌, ఎడిటింగ్‌: జెడి చక్రవర్తి, కెమెరా: ఎం.బి. అల్లికట్టి, విజువల్‌ ఎఫెక్ట్స్‌: చందు, పి.ఆర్‌.ఓ: బీ.వీరబాబు, ప్రొడ్యూసర్‌: రెడ్డమ్మ కే బాలాజీ, దర్శకత్వం: జేడీ చక్రవర్తి.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్