23.2 C
Hyderabad
Tuesday, December 5, 2023
spot_img

జయం రవి, నయనతార ‘గాడ్’ గ్రాండ్ రిలీజ్ రేపే!

తనీ ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ తర్వాత జయం రవి, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్బంగా… నిర్మాతలు సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ ఆదరణ ఉంటుంది. ఆ కోవలో తమిళంలో విడుదలైన మంచి విజయాన్ని సాధించిన ఇరైవన్ చిత్రాన్ని తెలుగులో గాడ్ అనే పేరుతో విడుదల చేస్తున్నాం. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ర‌న్ టైమ్‌ను 2 గంట‌ల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశాం. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఇందులో మళ్లీ జత కట్టారు. అక్టోబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆసాంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది’’ అని అన్నారు.

న‌టీన‌టులు:

జ‌యం ర‌వి, న‌య‌న‌తార‌, వినోద్ కిష‌న్‌, రాహుల్ బోస్‌, విజ‌య‌ల‌క్ష్మి, న‌రైన్‌, ఆశిష్ విద్యార్థి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: ఐ.అహ్మ‌ద్‌
నిర్మాత‌లు: సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్
సినిమాటోగ్ర‌ఫీ: హ‌రి కె.వేదాంతం
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా
ఎడిట‌ర్‌: జె.వి.మ‌ణికంఠ బాలాజీ
పి ఆర్ ఓ: నాయుడు – ఫణి (బియాండ్ మీడియా)

Latest Articles

థియేటర్ నుంచి కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు: నితిన్

నితిన్‌ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్