నేటి సమాజంలో స్త్రీ ఎదురుకుంటున్న సమస్యల నేపథ్యంలో సోషియో థ్రిల్లర్‌గా మన ముందుకు వస్తున్న ‘గుణ సుందరి కథ’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో రివీల్ చేసిన కొద్దిపాటి మాటలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇది చిన్న సినిమా అయినప్పటికీ బలమైన కంటెంట్‌తో వసున్న చిత్రం అని ట్రైలర్‌లో తెలుస్తోంది.
ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు ఓం ప్రకాష్ మార్త మాట్లాడుతూ ‘‘ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ముందుగా సెన్సార్ వారు అభినందించడం మా మొదటి విజయంగా భావిస్తున్నాం. అలాగే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న నటీనటులతో చేసిన ఈ ప్రయత్నం అందరికీ మంచి పేరు, గుర్తింపు తెస్తుంది. సీరియస్ కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా ఆడవాళ్లకు బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. అక్టోబర్ 13న రిలీజ్ కాబోతున్న గుణ సుందరి కథ చిత్రాన్ని అందరూ ఆదరించాలని, అలాగే కంటెంట్‌ని నమ్ముకుని చేసే మాలాంటి చిన్న చిత్రాలను కూడా అందరూ సపోర్ట్ చేయాలి’’ అని కోరారు.
నటీనటులు :
సునీత సద్గురు, కార్తీక్ సాహస్, రేవంత్, ఆనంద చక్రపాణి, అశోక్ చంద్ర, ఉదయ్ భాస్కర్, నరేంద్ర రవి, లలితా రాజ్, స్వప్న, వీరస్వామి, బేబీ తేజోసాత్మిక, అక్షయ్, హరి
సాంకేతిక వర్గం :
కథ, మాటలు, పాటలు: కవి సిద్ధార్థ.
కెమెరా : విజయ్ కుమార్ SVK
ఎడిటింగ్ : కళ్యాణ్ గాజా
సంగీతం : కళ్యాణ్ మోసెస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : నాగరాజు గడమళ్ళ, కిషన్ కన్నయ, అనుదీప్ ఆనంద.
కో -ప్రొడ్యూసర్ : బొడ్డు సైదులు
ప్రొడ్యూసర్ – డైరెక్టర్ : ఓం ప్రకాష్ మార్త
బ్యానర్ : మార్త క్రియేషన్స్
పీఆర్వో : దయ్యాల అశోక్