కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలల అవుతున్న బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారని అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెడితే… ఇచ్చిన హామీలకు దెనికెంత కేటాయింపులో చెప్పాల్సి ఉంటుందని జగన్ అన్నారు. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.