ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించిన నిధుల మంజూరుపై చర్చించనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిని కూడా చంద్రబాబు మోదీకి వివరించానున్నారు. దీంతో పాటు వివిధ రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. రైల్వే శాఖ సహాయ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలసి విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావించనున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇస్తున్నామని, అందుకోసం వెంటనే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరనున్నారు. మరికొందరి కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశముంది.
ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
0
206
Previous article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


