ఐ ప్యాక్‌ టీమ్‌తో జగన్ భేటీ..

స్వతంత్ర వెబ్ డెస్క్: వైసీపీకి రాజకీయ సలహాలు అందిస్తోన్న ఐప్యాక్ టీమ్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో వైసీపీ ముఖ్యనేతలు, ఐప్యాక్‌ టీమ్‌ ఇన్‌ఛార్జి రిషిరాజ్‌, సహ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తాజా పరిస్థితిపై సీఎం విశ్లేషించారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోన్న తీరుపై సీఎం సమీక్షించారు.

ఈ కార్యక్రమాలలో మంత్రులు,ఎమ్మెల్యేల భాగస్వామ్యం, పనితీరుపై చర్చించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ టీమ్ నివేదిక ఇవ్వగా, దీనిపై జగన్ చర్చించారని తెలస్తోంది. గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు వంటి అంశాలతో పాటు ఆయా నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పుపై చర్చ జరిపారని తెలుస్తోంది.

Latest Articles

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్