రూ. 250కోట్లకి అమ్ముడైన షారుక్ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్

స్వతంత్ర వెబ్ డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘జవాన్’. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే ‘జవాన్’ ట్రైలర్‌ను ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా థియేటర్స్‌లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్.. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ట్రైల‌ర్ ఇంకా రిలీజ్ కాక‌ముందే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు కావటం విశేషం. ఇక మరోపక్క సూపర్ యాక్ష‌న్ ఎలిమెంట్స్, న‌టీన‌టుల అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో కూడిన జ‌వాన్ ట్రైల‌ర్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

సాధార‌ణంగానే షారూక్ ఖాన్ సినిమాల‌కు సంబంధించిన హ‌క్కులన్నీ ఫ్యాన్సీ రేట్ల‌కే అమ్ముడ‌వుతుంటాయి. కానీ ఆయ‌న గ‌త సినిమాల రికార్డుల‌ను ఆయ‌న తాజా చిత్రాలు దాటేస్తున్నాని అనడంలో ఎలాంటి సందేహము లేదు. షారూక్ ఖాన్ గ‌త చిత్రం ప‌ఠాన్ బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టింది దీంతో ఇక ఇప్పుడు జ‌వాన్‌పై భారీ క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఆ క్రమంలోనే ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల కోసం అంద‌రూ పోటీ ప‌డుతున్నారు. ఇక నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు హాట్ కేకులా అమ్ముడ‌వటం చూస్తుంటే షారూక్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ ఎంట‌నేది స్ప‌ష్ట‌మైందని అంటున్నారు. షారూక్ ఖాన్ హీరోగా డైరెక్ట‌ర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్, గౌరీ ఖాన్ నిర్మిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

 

 

Latest Articles

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ … రేపు మూడు నోటిఫికేషన్లు…నియామక పక్రియ అంతా ఆన్లైన్ మోడ్‌లోనే

చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. రేపు మూడు నోటిఫికేషన్లను ఇచ్చేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సిద్ధమైంది. వచ్చే వారం రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్